టాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరు అయినటువంటి మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . మహేష్ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకులను పలకరించాడు. ఇక మరికొన్ని రోజుల్లోనే మహేష్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ మూవీ స్టార్ట్ కాక ముందే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మహేష్ , రాజమౌళి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంటాడు అని మహేష్ అభిమానులు గట్టిగా నమ్ముతూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే పైన ఫోటోలో మహేష్ బాబు తో పాటు ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన కలిగిన నటుడి కుమారుడు. ఇప్పటికే ఈ చిన్న బాబు సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో కూడా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడి గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇప్పటికైనా మహేష్ తో ఉన్న ఈ చిన్న పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన మరెవరో కాదు ... టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్. రోషన్ ఇప్పటికే పలు సినిమాలలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రోషన్ "నిర్మల కాన్వెంట్" అనే సినిమాతో హీరో గా పరిచయం అయ్యాడు. ఆఖరుగా రోషన్ "పెళ్లి సందD" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: