టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన జోనర్లలో సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు అక్కినేని నాగచైతన్య. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. 6 రోజుల్లోనే రూ.86 కోట్ల వసూళ్లు రాబట్టింది. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోనుంది. ఈ సక్సెస్ జోష్ లో ఉన్న చైతూ.. ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన నెక్స్ట్ మూవీ 'NC 24' ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.విరూపాక్ష' ఫేమ్ కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్యసినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది అక్కినేని వారసుడి కెరీర్ లో 24వ చిత్రం. పాన్ ఇండియా మూవీగా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో తెరకెక్కనుంది. లాస్ట్ ఇయర్ ఆయన బర్త్ డే స్పెషల్ గా 'NC 24' అనే వర్కింగ్ టైటిల్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్ అనే క్లారిటీ వచ్చేసింది. భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం టీమ్ ఇప్పటికే లొకేషన్స్ వేట ప్రారంభించింది.ఇదిలా ఉంటే, 'తండేల్' టీంని 'NC 24' కోసం రిపీట్ చేస్తున్నారు. డీఓపీ శ్యామ్ దత్ తో పాటుగా ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగల, ఎడిటర్ నవీన్ నూలి కూడా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నారు. వీరిద్దరూ ఇంతకముందు కార్తీక్ తీసిన 'విరూపాక్ష' మూవీకి పని చేసారు. అదే సినిమాకి సంగీతం సమకూర్చిన అజనీష్ లోక్‌నాథ్ ఈ థ్రిల్లర్‌కు మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ క్రమంలో    ఈ సినిమా మార్చి నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక సెట్లను నిర్మిస్తున్నట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: