టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో చాలా సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఇకపోతే పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలలో ఏకంగా రెండు సినిమాలలో రవితేజ హీరోగా నటించి రెండు మూవీ లతో కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇడియట్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తోనే రవితేజ కు హీరో గా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే రవితేజ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో కొన్ని సంవత్సరాల క్రితం అమ్మానాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా రవితేజ కెరియర్ లో మంచి విజయాలను అందుకున్న ఈ రెండు సినిమా ఆఫర్స్ మొదట పవన్ కళ్యాణ్ కు వచ్చాయట. కానీ ఆయన కొన్ని కారణాల వల్ల ఈయన ఈ సినిమా కథలను రిజెక్ట్ చేశాడట. దానితో పూరి జగన్నాథ్ , పవన్ రిజెక్ట్ చేసిన ఈ రెండు కథలను కూడా రవితేజ తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ రెండు సినిమాల ద్వారా రవితేజ కు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. అలాగే ఈ రెండు మూవీ ల లోని రవితేజ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: