టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో చిన్న వయసులోనే నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు .. ఆ సినిమా యావరేజ్ రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ డూపర్ హిట్ అయింది .. ఆ తర్వాత సురేష్ వ‌ర్మ .. దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా సుబ్బు ప్లాప్ అయింది ..  వివి వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన నాలుగో సినిమా ఆది పెద్ద హిట్ అయింది .. ఆ రోజుల్లోనే 100 కేంద్రాలలో వంద రోజులు ఆడింది .. త‌ర్వాత‌ బిగోపాల్ దర్శకత్వంలో వచ్చిన అల్లరి రాముడు సినిమా హిట్ అయింది .. ఆల్ల‌రి రాముడు తర్వాత ఎన్టీఆర్ - రాజమౌళి దర్శకత్వంలో నటించిన సింహాద్రి సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులను అలార‌రించింది ..


థియేటర్లలో సింహాద్రి సినిమా చూస్తున్న తెలుగు సినిమా ప్రేక్షకులు పునకలతో ఊగిపోయారు .సింహాద్రి ఎన్నో కేంద్రాలలో ఎన్నో అద్భుతమైన చెక్కుచెదరని రికార్డులు సొంతం చేసుకుంది .. ఆ రోజుల్లోనే 55 కేంద్రాలలో 175 రోజులు ఆడి టాలీవుడ్ లో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది .. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ చిన్న పల్లెటూర్లో రిలీజ్ అయిన సింహాద్రి ఏకంగా 150 రోజులు ఆడింది .. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండలం అనంతపల్లి ఒక చిన్న పల్లెటూరు .. ఇది ఒక చిన్న పంచాయతీ ఆ పంచాయతీలో ఉన్న అన్నపూర్ణ పిక్చర్ ప్యాలెస్ లో సింహాద్రి సినిమాను రిలీజ్ చేశారు .. చిన్న పల్లెటూరులో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవ్వటం అప్పట్లో ఒక సంచలనం ..


సినిమాకు సూపర్ డూపర్ హిట్ రావడంతో ఈ సెంటర్లో ఏకంగా 150 రోజులు ఆడింది .. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులతో పాటు పలు కళాశాలల నుంచి విద్యార్థులు సింహాద్రి సినిమా చూసేందుకు అన్నపూర్ణ థియేటర్ కు క్యూ కట్టేవారు .. అలా నెల రోజులపాటు అన్నపూర్ణ థియేటర్లో సింహాద్రి సినిమాకు అస్సలు టిక్కెట్లు దొరకలేదు .. క్రమంగా 50 రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడింది ఆ తర్వాత సినిమాకు మరింత సూపర్ టాక్ రావడంతో వంద రోజులు  ..చివరికి 150 రోజులు పాటు ఆడింది .. అలా అనంతప‌ల్లి నల్లజర్ల సినిమా చరిత్రలో 150 రోజులు ఆడిన సినిమాగా సింహాద్రి చరిత్రలో నిలిచిపోయింది .. ఈ రికార్డును ఆ సెంటర్లలో మరే సినిమా కూడా బ్రేక్ చేయలేదు .. అలా సింహాద్రి సినిమాతో అనంతప‌ల్లిలో ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపించారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: