
ఇక రష్మి యువ సీరియల్ లో నటించిన కొన్ని క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్లిప్స్, పోస్టులు రష్మి గౌతమ్ వరకు చేరుకున్నాయి. ఇక ఇవి చూసిన రష్మి చాలా మురిసిపోయింది. ఆ రోజులు చాలా బాగుండేవి అంటూ సంబర పడిపోయింది. అలాగే ఇవి చూశాక నాగార్జునకి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టింది. 'ఈ పోస్టులను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. చాలా మంచి ఫీల్ వస్తుంది. యువ సీరియల్ రీ యూనియన్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది' అంటూ రష్మి, నాగార్జునకి రిక్వెస్ట్ పెట్టింది. మరి ఆ కోరిక తిరుతుందో లేదో చూడాలి మరి. అక్కినేని నాగార్జున, రష్మి కోరికను తీరుస్తాడా లేదా అనేది చూడాలి.
ఇక ఇప్పుడు రష్మి గౌతమ్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ లలో యాంకర్ గా చేస్తుంది. కొన్ని సార్లు స్పెషల్ ఈవెంట్ లలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కూడా నటిస్తుంది. కానీ ఆ సినిమాలు కూడా అంతగా హిట్ కొట్టలేదు. ఇక మనకి సినిమాలు సెట్ కావు అనుకుందో ఏమో.. కానీ రష్మి ఇప్పుడు పూర్తి ఫోకస్ బుల్లితెరపైనే పెట్టింది. ఇప్పుడు సుధీర్, రష్మి కలిసి యాంకరింగ్ చేయడం లేదు. అయినప్పటికీ వీరిద్దరి లవ్ ట్రాక్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.