సికింద్రాబాద్లో పుట్టి తెలుగు వ్యక్తి గా పెరిగిన అజిత్ తమిళంలో స్టార్ హీరో అయిపోయాడు .. అజిత్ తమిళంలో స్టార్ హీరో అయినా తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే .. అజిత్ నటించిన సినిమాలు అన్నీ తెలుగులోను మంచి విజయాలు అందుకున్నాయి .. ఇక తమిళనాట అజిత్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు . అజిత్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పూనకలతో ఊగిపోతారు అజిత్ రీసెంట్గా పట్టుదల అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు . భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు .


అయితే అజిత్ ఫ్యాన్స్ కు మాత్రం పట్టుదల మంచి కేక్ ఇచ్చింది . ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.. ఇక ఇప్పుడు అజిత్  గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటిస్తున్నాడు .. ఈ సినిమాలో అజిత్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అజిత్ అభిమానులు భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అజిత్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు అజిత్ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తోంది . దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆమె అజిత్ సినిమాలో నటించడం విశేషం .


ఇంత‌కి ఆమె మ‌రి ఎవరో కాదు సినియ‌ర్‌ముద్దుగుమ్మ సిమ్రాన్ ఒకప్పుడు తమిళం తో పాటు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు సిమ్రాన్ తెలుగులో కూడా చిరంజీవి  , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. అప్పట్లో అజిత్ సిమ్రాన్ కాంబినేషన్లో వచ్చిన వాలి ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే .. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ  సినిమాలో అజిత్ , సిమ్రాన్ కలిసి నటిస్తున్నారని టాక్ వైరల్ అవుతుంది. మరి సిమ్రాన్ పెళ్లయ్యాక పిల్లలు పుట్టాక మరోసారి అజిత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. వీరిద్దరి కొత్త కాంబినేషన్ తెరమీద ఎలా ఉంటుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: