ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్లో నటిస్తున్న చిత్రం వార్ 2. ఇందులో హృతిక్ రోషన్ కూడా నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో స్పై థ్రిల్లర్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. యష్ రాజ్ ఫిలిం బ్యానర్ పైన తెరకెక్కిస్తున్నటువంటి ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం వార్ 2 సినిమా ఈ డేట్ కి రిలీజ్ అవ్వడం కష్టం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇందుకు గల కారణం ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదని రిలీజ్ కి ఇంకా ఐదు నెలల సమయం ఉన్నప్పటికీ కూడా కొంతమేరకు అవుట్డోర్ షూటింగ్ పనులు కూడా చేయవలసి ఉన్నదట. కొన్ని సన్నివేశాలను వివిధ ప్రాంతాలలో కూడా తీయాల్సి ఉన్నదట. వీటన్నిటికీ చాలా సమయం పడుతుంది కాబట్టి ఏడాది చివరిలో వార్ 2 సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి విషయాలను కూడా ప్రకటించలేదు.

ప్రస్తుతమైతే వార్ 2 సినిమా పోస్ట్ పోన్ అనే విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నది. ఒకవేళ నిజంగానే ఈ సినిమా వాయిదా పడితే ఈ సినిమా డేట్ ని పలు సినిమాలు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయట. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటిస్తున్న లాహోర 1947 అనే చిత్రాన్ని ఇదే డేట్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఒకవేళ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ కనక పూర్తి అయితే ఫ్రీగా ఉండాలని చూస్తున్నారట. అలాగే తన తదుపరి చిత్రాల షూటింగ్ విషయంలో కూడా ఎన్టీఆర్ పక్క ప్లాన్ తోనే ముందుకు వెళుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: