టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకం టూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే సినిమా తో వెండి తెరకు పరిచ యం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకున్నాడు . ఆ తర్వాత కూడా ఈయన అనేక సినిమాలో నటించగా అందు లో చాలా మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి . ఇక పోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం దక్కడం లేదు.

ఇక వరుసగా ఈయన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన కొంత కాలం క్రితం ది వారియర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత స్కంద , డబల్ ఇస్మార్ట్ అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీలు కూడా అపజయాలను అందుకున్నాయి. ఇలా మాస్ ఎంటర్టైలర్ మూవీలతో అపజయాలను ఎదుర్కొంటున్న ఈయన ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ కి దర్శకత్వం వహించడం మహేష్ బాబు పి దర్శకత్వంలో రాపో 22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఇకపోతే వరుస అపజయాలతో డిలా పడిపోయిన రామ్ పోతినేని , మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిసల్ట్ తర్వాతే ఏ మూవీ అయినా ఓకే చేయడానికి ఆయన ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అలా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న రాపోర్టు 22 సినిమా రిసల్ట్ తర్వాతే రామ్ పోతినేని తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన డిసిషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: