మన టాలీవుడ్ కుర్ర హీరోలు తమ కెరీర్ లో ఎప్పుడు చేయని నెవర్ బిఫోర్ రోల్స్ చేస్తున్నారు .. కొన్ని సినిమాలు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఎంత దూరమైన దూకేయలనిపిస్తుంది .. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో విరూపాక్ష అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది .. ఈ సినిమా ఇచ్చిన నమ్మకం తో ఇప్పుడు ఆయన సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్నారు .. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు .. విరూపాక్ష సినిమాకు మించి ఉంటుందని చర్చలు వినిపిస్తున్నాయి ..


 మెగా కాంపౌండ్ లో విరూపాక్షతెరకెక్కించిన కార్తీక్ దండు ఇప్పుడు నాగ చైతన్యతో  సినిమా చేస్తున్నాడు .. థింక్ డిఫరెంట్ అనే కాన్సెప్ట్ నమ్మే కార్తీక్ ఇప్పుడు చైతన్యతో ఫాంటసీ కథతో సినిమా చేస్తున్నాడు .. ఈ కథ ఊహాతీతంగా ఉంటుందని వినిపిస్తోంది .. తండేల్‌ సక్సెస్ మీద ఉన్న చైతు కార్తీక్ సినిమా కోసం మేకవర్ అవుతున్నాడు .. సితార ఎంటర్టైన్మెంట్స్ లో జొన్నలగడ్డ సిద్దు సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ అన్నటాక్ ఆల్రెడీ ఉంది .. ఇప్పుడు ఈ కాంబినేషన్లో తెరకెక్కి కోహనూర్ సినిమా మీద కూడా అంచనాలు మామూలుగా లేవు. కోహనూర్ అనే పదంలో ఏదో పాజిటివిటీ వినిపిస్తుంది .


 అలాంటిది సిద్దు ఆ టైటిల్తో సినిమా చేస్తున్నాడంటే భారీగా ఎక్స్ పెక్ట్ చేయవచ్చు .. ఇక విజయ్ దేవరకొండ చేతిలో ఉన్న సినిమాలు అన్ని సంథింగ్ స్పెషల్ సబ్జెక్టులతోనే రెడీ అవుతూ ఉంటాయి. ఇటీవల టీజర్ తో వచ్చిన కింగ్‌ డమ్‌ మెప్పించడం మాత్రమే కాదు .. నెక్స్ట్ లైన్ లో ఉన్నవి కూడా ప్రేక్షకుల ఊహకు అందని కథ‌ల‌ని మీరు ఎంతైనా ఊహించుకోండి అంతకుమించే ఉంటుంది బొమ్మ అంటూ బౌండరీలు కొట్టటానికి సిద్ధమవుతున్నారు . యంగ్ హీరోలు మరి ఈ హీరోల కెరీర్ లోనే వారు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఎంతైనా స్పెషల్ గా ఉంటాయి అని చెప్పటం లో సందేహం లేదు ..

మరింత సమాచారం తెలుసుకోండి: