ఫైనల్లీ కోట్లాదిమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన న్యూస్ త్వరలోనే రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ పై బాగా నెగిటివ్ వార్తలు ఎక్కువగా వినిపించాయి అంతేకాదు అల్లు అర్జున్ ఈ నెగిటివ్ వార్తల  నుంచి తప్పించుకోవడానికి తనకి సంబంధించిన విషయాలు డైరెక్ట్ గా ఫ్యాన్స్ తో తెలియజేయడానికి ఒక స్పోక్స్ పర్సన్ కూడా నియమించుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మరొక గుడ్ న్యూస్ రాబోతుంది . ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది.


పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమాకి కమిట్ అయినట్టు అందరికి తెలిసిందే.  అయితే ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ కూడా బయటకు రాలేదు . కొంతమంది ఈ సినిమా ఆగిపోయింది అంటూ కూడా ప్రచారం చేశారు . ఆ తర్వాత అట్లీ పేరు తెరపైకి వచ్చింది.  అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో సినిమా రాబోతున్నట్లు బాగా వార్తలు వినిపించాయి. రీసెంట్ గానే అట్లీ టీం వచ్చి అల్లు అర్జున్ ని మీట్ అయింది అంటూ కూడా ప్రచారం జరిగింది .



అయితే దీనిపై కూడా ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు . వీటన్నిటికీ తెరపడాలి అంటే కచ్చితంగా అల్లు అర్జున్ పర్సనల్ టీమ్ స్పందించాల్సిందే . అయితే అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను ఉగాది కానుకగా రివీల్ చేయబోతున్నాడట . ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తదుపరి చిత్రాలపై ఓ క్లారిటీ ఇవ్వబోతున్నారట . ఈ విషయం తెలుసుకున్న జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . అల్లు అర్జున్ జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో తన లైఫ్ ని కొనసాగించడానికి బాగా మంచి నిర్ణయం తీసుకున్నాడు అని అల్లు అర్జున్ తీసుకునే ప్రతి డెసిషన్ కూడా తన ఫాన్స్ కి మంచి ఫీలింగ్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.  సోషల్ మీడియాలో ప్రజెంట్ అల్లు అర్జున్ కి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: