నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరో గా నటించిన తాజా సూపర్ డూపర్ హిట్ సినిమా డాకు మహారాజ్‌. యువ దర్శకుడు కొల్లి బాబీ దర్శకత్వం లో తెరకెక్కిన డాకు మహారాజ్‌ సినిమా సంక్రాంతికి గట్టి పోటీ మధ్య రిలీజ్ అయిన కూడా ఏకంగా 180 కోట్ల వసూలు రాబట్టి బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గా గెలిచింది .. వసూళ్ల పరంగా చూస్తే బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమా డాకు మహారాజ్‌ ఈ సినిమా తో బాలయ్య వరుసగా నాలుగో విజయం తన ఖాతాలో వేసుకున్నారు ..


 డాకు మహారాజ్‌ సినిమా తర్వాత బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీను తో  చేస్తున్న‌ అఖండ 2 తాండవం సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు .. ఈ సినిమాను కంటిన్యూగా షూటింగ్ చేసి ఈ యాడాది దసరాకు రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి .. ఇప్పటికే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా తాజాగా ఓ సాలిడ్ బజ్ వినిపిస్తోంది .. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ నటుడు కూడా బాలయ్యను ఢీకొట్టే పాత్ర లో కనిపించబోతున్నారట .. బాలీవుడ్ సీనియర్ హీరో స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా అఖండ 2 తాండవం సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది ..


 తాను విలన్ రోల్ లో కనిపిస్తారని కూడా సమాచారం .. బాలయ్య - సంజయ్ దత్ మధ్య వచ్చే సన్నివేశాలతో తెరమీద తాండవమే ఉంటుందని అంటున్నారు .. ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్ర పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది .. ఈ సినిమాకు తమ ఎస్ ఎస్ సంగీతం అందిస్తుండ గా హీరోయిన్ సంయుక్త నటిస్తున్నారు .. అలాగే 14 రీల్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది .. సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవ‌ల్‌లో అఖండ‌2 తాండవం సినిమాను రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతోంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: