
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా తనకంటూ స్పెషల్ ఇమేజె క్రియేట్ చేసుకున్న కీర్తి సురేష్. రీసెంట్ గానే "బేబీ జాన్" సినిమాతో అట్టర్ ప్లాప్ మూవీ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా కారణంగా ఆమె ఎంత ట్రోలింగ్ ఎదుర్కొన్న అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె నటించిన ఫస్ట్ సినిమా ఇదే కావడం ..ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం ఆమెకు ఫుల్ నెగిటివిటీ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ పై మరొక సారి నెగిటివ్గా వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ సినిమా"చావా"లో హీరోయిన్గా ముందుగా ఆమెకే ఆఫర్ వచ్చిందట .
కానీ ఇంత ట్రెడిషనల్ పాత్ర కి న్యాయం చేయలేను అంటూ బేబీ జాన్ సినిమా కోసం ఈ సినిమా రిజెక్ట్ చేసిందట. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు ఎక్కువగా వైరల్ అవుతుంది. అటు బేబీ జాన్ సినిమా ఫ్లాప్ అయింది . ఇటు చావా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నువ్వు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ నీ కెరియర్ ని పాతాళానికి పడిపోయేలా చేసింది కీర్తి సురేష్ అంటూ ఘాటు ఘాటుగా ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు . చాలామంది కీర్తి సురేష్ పై నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు . కీర్తి సురేష్ ఇవన్నీ మర్చిపోవాలి అంటే మరొక సూపర్ డూపర్ హిట్ ఆమె ఖాతాలో పడాల్సిందే . ఆ లక్కీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాల్సిందే..!