
విడుదలైన రెండవ రోజే HD ప్రింట్, డాళ్బీ ఆడియో తో ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చేసింది . లోకల్ టీవీ చానెల్స్ తో పాటు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులలో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. నిర్మాతలు పైరసీ ని అడ్డుకునేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా, అడ్డుకోవడం వాళ్ళ వల్ల కాలేదు. ఫలితంగా ఓటీటీ మీద అ ప్రభావం పడింది. థియేటర్స్ లో మంచి వసూళ్లు ఇప్పటికీ వస్తున్నా కూడా, ఓటీటీ లో తొందరగా విడుదల చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అందుతున్న సమాచారం ప్రకారం తండేల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం. తండేల్ మూవీ మార్చి 7 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది అంటున్నారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి రానుందని వినికిడి. మరి తండేల్ సినిమా నిజంగానే మార్చి 7న ఓటీటీలో అడుగు పెడుతుందో లేక థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ ని బట్టి మళ్ళీ డేట్ వెనక్కి వెళ్తుందో చూడాలి.