సంగీత దర్శకుడిగా..హీరోగా.. ఇండస్ట్రీలో రాణిస్తున్న జీవి ప్రకాష్ కుమార్ అంటే తెలియని వారు ఉండరు. తమిళంలో ఫేమస్ అయిన ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అయితే అలాంటి జీవీ ప్రకాష్ కుమార్ గత ఏడాది తన భార్య సైంధవికి విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని చాలామంది చర్చించుకున్నారు.అయితే  వీరిద్దరూ ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నప్పటికీ చాలా రూమర్లు వీరి పర్సనల్ లైఫ్ పై వినిపించాయి. అయితే తాజాగా జీవి ప్రకాష్ సైంధవి గురించి మరో రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే జీవి ప్రకాష్ కుమార్హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉండడం వల్లే తన భార్యకి విడాకులు ఇచ్చేసారని తెలివిగా భార్యను వదిలించుకున్నాడు అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. 

అయితే తాజాగా ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా హీరోయిన్ దివ్యభారతతో జీవి ప్రకాష్ ప్రేమలో ఉన్నారని వీరిద్దరి మధ్య ఉన్న డేటింగ్ సైంధవికి తెలిసి ఇద్దరి మధ్య గొడవలు వచ్చి చివరికి విడాకులు తీసుకున్నారని రూమర్లు వినిపించాయి. అంతేకాదు దివ్యభారతి మీద ఉన్న ప్రేమతోనే వీరిద్దరూ కలిసి వరుస సినిమాలు చేస్తున్నట్టు రూమర్లు వినిపించాయి. అయితే తాజాగా జీవి ప్రకాష్,దివ్యభారతి కలిసి నటించిన కింగ్ స్టన్ మూవీ మార్చి 7న విడుదలకు సిద్ధమవుతుండడంతో ఈ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జీవి ప్రకాష్ మాట్లాడుతూ..చాలా రోజుల నుండి నేను హీరోయిన్ తో ప్రేమలో ఉన్నానని రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. 

కానీ అందులో ఎలాంటి నిజం లేదు.మేమిద్దరం కలిసి చేసేది ఇది రెండో సినిమా మాత్రమే. అలాగే నేను ఆమెను షూటింగ్ సెట్లో తప్ప ఎక్కడ కూడా కలవలేదు. అలాంటిది ఆమెతో ఎఫైర్ ఉన్నట్టు ఎలా రాస్తారు. మా ఇద్దరి విడాకులకు కారణం ఆ హీరోయిన్ కాదు అసలు దివ్యభారతతో నాకు లవ్ అనే రిలేషన్ లేదు. మా ఇద్దరి మధ్య  ఉంది స్నేహం మాత్రమే అంటూ జీవి ప్రకాష్ చెప్పుకొచ్చారు. అయితే ఇదే మాట గతంలో కూడా చెప్పినప్పటికీ వరుసగా మరో సినిమా కూడా ఈ దివ్య భారతితో చేయడంతో జీవి ప్రకాష్ విడాకులకు కారణం దివ్య భారతి అంటూ చాలా రూమర్లు మీడియాలో వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: