టాలీవుడ్ లో నటుడు సుబ్బరాజు అంటే తెలియని వారు ఉండరు.. హీరోలకు ఏమాత్రం తగ్గని కటౌట్ తో ఉండే సుబ్బరాజు విలన్ పాత్రలతో పాటు కామెడీ విలన్ పాత్రలు కూడా పోషిస్తూ ఉంటారు.. అలా ఇండస్ట్రీలో అద్భుతంగా దూసుకుపోతున్న సుబ్బరాజు తాజాగా బాహుబలి సినిమాలో చేసి తప్పు చేశానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
సినిమా వల్ల తనకు నష్టం జరిగిందట.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. బాహుబలి తెలుగు సినిమా చరిత్రలోనే రికార్డులు తిరగరాసి, పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అలాంటి బాహుబలి చిత్రంలో చేసిన ప్రతి నటుడు ఎంతో గుర్తింపు పొంది ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.. మరి కొంతమంది బాహుబలి సినిమాలో ఒక ఛాన్స్ ఇస్తే నా లైఫ్ సెట్ అయి ఉండేదని భావిస్తూ వచ్చారు...


 అలాంటి బాహుబలి చిత్రంలో కీలక పాత్రలో నటించిన సుబ్బరాజు మాత్రం ఆ సినిమా వల్ల నాకు నష్టమే జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.. మరి సుబ్బరాజుకు జరిగిన నష్టం ఏంటో ఇప్పుడు చూద్దాం.. నటుడు సుబ్బరాజు  ఖడ్గం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి  తన నటనతో అద్భుతమైన గుర్తింపు పొంది ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన బాహుబలి చేసే సమయంలో  చాలా సినిమా ఆఫర్లు వచ్చాయట.
 
తనకు ఆఫర్ వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయిందట.. అయితే బాహుబలి సినిమా కు ఈయన అంతకుముందే డేట్స్ ఇవ్వడంతో  సినిమాలను ఒప్పుకోలేకపోయారట.. దీనివల్ల ఆయనకు డబ్బులపరంగా  ఇతర క్యారెక్టర్ల పరంగా నష్టమే జరిగిందని  ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న నెటిజన్స్  మేము ఆ చిత్రంలో ఆఫర్ దొరకలేదని బాధపడితే నువ్వు ఆఫర్ తీసుకొని బాధపడుతున్నావా, నీకు జరిగిన నష్టం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: