కథ నచ్చకపోతే నచ్చలేదు అని మొహం మీదే రిజెక్ట్ చేస్తారు.. లేదా డేట్స్ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతారు. కానీ కథ నచ్చలేదని ఎవరైనా మొహం మీద ఉమ్మేస్తారా అంటే అస్సలు అలా చేయరు అని చాలామంది అనుకుంటారు. కానీ హీరో శింబు మాత్రం అలా కథ నచ్చకపోవడంతో మొహం మీదే ఉమ్మేసారట. మరి ఇంతకీ శింబు ఎవరి మొహం మీద ఉమ్మేసారు.. ఎందుకు అలాంటి తప్పు పని చేశారు అనేది ఇప్పుడు చూద్దాం..తమిళ ఇండస్ట్రీలో శింబుకి హీరోగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సినిమాల్లో చాలా నేచురలిటీ ఉంటుంది.పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలకు పోకుండా చాలా నేచురల్ గా తన సినిమాను ముగిస్తారు. తన నేచురల్ యాక్టింగ్ తో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టిన శింబు కేవలం కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో..

అయితే అలాంటి ఈ హీరోడైరెక్టర్ ని తనతో సినిమా చేయమని స్వయంగా చెప్పారట. కానీ తీరా డైరెక్టర్ కథ చెప్పాక మొహం మీదే ఉమ్మేసారట. ఇక ఆ డైరెక్టర్ ఎవరంటే సుశీంద్రన్. డైరెక్టర్ సుశీంద్రన్ హీరో జై తో ఈశ్వరన్ అనే సినిమాని తీద్దామనుకున్నారట.కానీ ఓ సందర్భంలో హీరో శింబు డైరెక్టర్ సుశీంద్రన్ ని కలిసి నాతో సినిమా చేయండి అని అడగడంతో జై కోసం రాసుకున్న కథని శింబు తో చేద్దాం అనుకున్నారట.

ఇక ఈ స్టోరీ శింబుకి చెప్పగా ఈ స్టోరీ అస్సలు బాలేదు అని మొహం మీదే ఉమ్మేసారట. దాంతో యాక్టింగ్ కి తగ్గట్టుగా ఈ కథని మార్పులు చేర్పులు చేసి చివరికి శింబుతో సినిమా తెరకెక్కించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈశ్వరన్ సినిమా అంతగా అలరించకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుశీంద్రన్ చెప్పారు. ప్రస్తుతం డైరెక్టర్ మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ కథ నచ్చకపోతే ఎవరైనా మొహం మీద ఉమ్మేస్తారా రిజెక్ట్ చేయాలి కానీ అంటూ కామెంట్లు పెడుతున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: