- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కొన్ని కథలు వినేటప్పుడు బాగుంటాయి. కొన్ని తెరమీద చూసాకే భలే అనిపిస్తుంటాయి. ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలైనా, వెబ్ సిరీస్‌లైనా కూడా అందరినీ అలరిస్తుంటాయి. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో చేసిన ‘సమ్మేళనం’ సిరీస్ ఈటీవీ విన్‌లోకి వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతోంది.


ప్రియా వడ్లమాని, గణ ఆదిత్య, విజ్ఞయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో సునయని. బి, సాకెత్. జె నిర్మాతలుగా తరుణ్ మహాదేవ్ తెరకెక్కించిన సిరీస్ ‘సమ్మేళనం’. ప్రస్తుతం ఈ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది. కొత్త మొహాలతో ఇలాంటి సున్నితమైన అంశాల ను జోడించి డైరెక్టర్ తరుణ్ మహాదేవ్ సిరీస్‌ను అద్భుతంగా మలిచాడు. ఓటీటీ కదా అని అడల్ట్ కంటెంట్ కానీ, అడల్ట్ కామెడీని కానీ జొప్పించలేదు. ఫ్యామిలీ తో కలిసి చూసేలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. తోలి ప్రయత్నంలోనే మంచి మార్కులు వేయించుకున్నాడు.


ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మొదటి రెండు ఎపిసోడ్ ను క్యారక్టర్స్ పరిచయానికి వాడుకున్న దర్శకుడు మూడో ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ పరుగులు పెట్టించాడు. ఈ క్లీన్ సిరీస్‌కు శ్రావణ్ జీ కుమార్ విజువల్స్,  శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ సంగీతం ప్రధాన బలం. మరీ ముఖ్యంగా శరవణ వాసుదేవన్ బీజీఎం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. కొన్ని సీన్స్ లో బీజీఎం మనసుని హత్తుకునేలా ఇచ్చాడు. ఫైనల్ గా సమ్మేళనం ఈ వారం చూడదగ్గ సిరీస్ లో ముందుంటుంది.  ప్రస్తుతం ఈ సిరీస్ ఈటీవీ విన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: