టాలీవుడ్ అండ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే విడుదలైన లైలా సినిమా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంది ముఖ్యంగా పొలిటికల్ పరంగా కూడా ఇబ్బందులు ఎదురు కావడంతో ఈ సినిమా కూడా కొంతమేరకు అడల్ట్ కంటెంట్ ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. దీంతో ఎటు చూసినా కూడా లైలా సినిమాకి పెద్ద దెబ్బ పడిందని చెప్పవచ్చు. అయితే ఈ మేరకు విశ్వక్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును సైతం షేర్ చేశారు." మీకోసం యధాతధంగా అందిస్తున్నాము.. నమస్తే ఇటీవలే తన సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి వెళ్లలేకపోతున్నాయని తెలిపారు.


తన చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మకమైన విమర్శలను పూర్తిగా తాను అంగీకరిస్తున్నానని తెలిపారు.. తనను నమ్మి తన ప్రయాణానికి మద్దతు ఇచ్చిన అందరికీ కూడా తన అభినందనలు తెలిపారు. అలాగే హృదయపూర్వక క్షమాపణలు కూడా తెలిపారు. తన ప్రాధాన్యత ఎప్పుడూ కూడా కొత్తదనం వైపు గానే ఉంటుంది కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను తాను గౌరవిస్తున్నానని వెల్లడించారు.. ఇకపైన ప్రతి సినిమా క్లాసు లేదా మాస్ ఉంటుంది అని అసభ్యత అనేది ఉండదని.. తాను ఒక చెడు సినిమా తీస్తే తనని విమర్శించే హక్కు కూడా పూర్తిగా మీకే ఉన్నది ఈ ప్రయాణంలో ఎవరూ లేని సమయంలో నా తోడు ఉన్నది మీరే అంటూ తెలిపారు విశ్వక్.


తన కెరియర్ ప్రారంభం నుంచి తాను ఎంచుకున్న కథలను ఎంతో ఇష్టపడ్డారు ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు తన ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయాన్ని తీసుకుంటున్నానని తెలిపారు. తనమీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్కు డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా కృతజ్ఞత తెలిపారు విశ్వక్. త్వరలోనే మరొక బలమైన కథతో మీ ముందుకి వస్తానని తెలిపారు". మీ మద్దతు కూడా నాకు చాలా ముఖ్యమంటూ విశ్వక్ ఒక నోట్ ని విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: