ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు డైరెక్షన్ రంగంలో కూడా రాణిస్తున్నారు.. కొంతమంది డైరెక్టర్లుగా చేసి హీరోగా కూడా రాణిస్తున్నారు.. అలా మల్టీ టాలెంటెడ్ గా  వ్యవహరిస్తున్న నటుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రిషబ్ శెట్టి.. ఈయన సినీ రంగంలో మొదటగా డైరెక్షన్ రంగంలో అడుగుపెట్టి పలు సూపర్ హిట్ చిత్రాలకు  దర్శకత్వం వహించారు. అలాంటి ఈయన కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, భాషల్లో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.. ఆయన డైరెక్షన్ లో హీరోగా విడుదలైన మూవీ కాంతారా..ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు..ఈ సినిమాలో హీరోగా నటిస్తూ  డైరెక్షన్ చేసిన ఈయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.. 

కట్ చేస్తే రిషబ్ శెట్టి నటుడు అవ్వడం కంటే ముందు దర్శకుడిగా కన్నడలో చాలా చిత్రాలను తీశారు.. అంతేకాదు తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేస్తానని హామీ ఇచ్చారట.. అంతేకాదు సినిమా కథ కూడా చెప్పడంతో రామ్ చరణ్ కు బాగా నచ్చిందని తెలుస్తోంది. అయితే అప్పుడే సినిమా షూటింగ్ ప్రారంభిద్దామంటే ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ వల్ల రామ్ చరణ్ కాస్త సమయం అడిగారట.. ఇంతలో రిషబ్ శెట్టి కాంతారా మూవీ పూర్తి చేసి భారీ హీట్ అందుకున్నారు..

మూవీ తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈయన డైరెక్షన్ రంగం కంటే హీరో గానే ఉండాలని భావిస్తున్నారట. ప్రస్తుతం రిషబ్  చేతిలో హనుమాన్, కాంతారా చాప్టర్ 1, చత్రపతి శివాజీ మహారాజ్ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.. ఈ సినిమాలన్నీ పూర్తయ్యేసరికి ఆయన ఏ రేంజ్ కి వెళ్ళిపోతారో తెలియదు..ప్రస్తుతం రామ్ చరణ్ పలు చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.. ఈ విధంగా రామ్ చరణ్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లు చేసే చిత్రాన్ని మిస్ చేసుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: