ఎన్టీఆర్ 31 సినిమాకు టైటిల్ కన్ఫర్మ్ అయింది .. నిన్న మొన్నటి వరకు ట్రెండింగ్‌లో ఉన్న పేరునే ఇప్పుడు ఫిక్స్ చేశారని మాట గట్టిగా వినిపిస్తుంది .. సమ్మర్ కి ఊహించని గిఫ్ట్ రెడీ .. అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు .. ఇంతకీ ఎన్టీఆర్ , నీల్‌ సినిమాకు సంబంధించిన సంగతులు ఏమిటి ? ఎన్టీఆర్ , నీల్ ప్రాజెక్ట్ అనాల్సిన అవసరం లేదా.. మనం అధికారికంగా డ్రాగన్ అని పిలుచుకో వచ్చని ఫ్యాన్స్ ఒకరితో ఒకరు హ్యాపీగా అనుకుంటున్నారు ..ఇక దీనికి రీజన్ గా లేటెస్ట్ ప్రదీప్‌ రంగనాథన్ మూవీ ని చూపిస్తున్నారు .

కోలీవుడ్లో డ్రాగన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని రిలీజ్ చేస్తున్నారు .. దీన్నిబట్టి ఎన్టీఆర్ , నీల్‌ సినిమాకు డ్రాగన్ అనే పేరు మేకర్స్ కన్ఫర్మ్ చేసినట్టే అని లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ . ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే ఫిలిం సిటీ లో ఓల్డ్ కొలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో స్పెషల్ సెట్ కూడా రెడీ చేశారు . ఇక సెట్లోనే  ఈరోజు ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు ప్రశాంత్ నీల్ పోస్ట్లు కూడా పెట్టారు . సెకండ్ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ ఈ షూటింగ్లో జాయిన్ అవుతారు .


పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న డ్రాగన్ లో మలయాళ హీరో  టొవినో థామస్‌ .. ఈ మూవీలో కీలకపాత్రలో నటించనున్నారు .. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది .. ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు నీల్ . ప్రస్తుతం వార్ 2 పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ .. త్వరలోనే ఈమూవీలో కూడా నాటు నాటు తరహా పాటను తెర్కక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు వార్ 2 మేకర్స్ .. ఆ షూట్‌ పూర్తయిన తర్వాత నీల్ సినిమా షూటింగ్లోకి రాబోతున్నాడు యంగ్ టైగర్ .

మరింత సమాచారం తెలుసుకోండి: