
ఇక పుష్ప సిక్వల్ లోను గంధపు చక్కల స్మగ్లింగ్ కీలక రోల్ ప్లే చేసింది .. వరల్డ్ వైడ్ ఆడియన్స్ మనసులు కొలగట్టింది కాబట్టి ఇది ఇండస్ట్రీ హిట్ అయింది . అయితే ఇప్పుడు కెన్యా అడవుల్లో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు రాజమౌళి .. అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే రాబోతుంది .. అలాగే మహేష్ ని కూడా ఇప్పటివరకు ఎప్పుడు చూడని కొత్త అవతారంలో చూపించడానికి రాజమౌళి సిద్ధమవుతున్నాడు. మరో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం లో రాబోయే సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండనుంది .. ఈ సినిమాలో శర్వానంద్ తెలంగాణ యాసలో అదరగొట్టబోతున్నారని తెలుస్తుంది .
అలాగే మరో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో భారీ హర్రర్ సినిమాలో నటిస్తున్నారు .. మరో లేడీ సూపర్ స్టార్ అనుష్క ఘాటీ మొత్తం అడవుల నేపథ్యంలోనే ఉండబోతుంది .. ప్రస్తుతం ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్లో ఘాటీ మూవీ ఉంది. ఈ సినిమా మీద అనుష్క అభిమానులే కాదు దర్శకుడు క్రిష్ కూడా గట్టి ఆశలు పెట్టుకున్నాడు .. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర లోను అడవుల నేపథ్యంలో సన్నివేశాలు ఉండబోతున్నాయని టాక్ . ఇక మరి ఈ ట్రెండింగ్ బ్యాక్ డ్రాప్ ఈ హీరోలకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.