టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ఒక చిన్న నిర్ణయంతో ఒక పెద్ద ఫ్లాప్ ను అందుకున్నట్లు తెలుస్తుంది అదేమిటో తెలుసుకుందాం.

అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల క్రితం surya NAA ILLU INDIA' target='_blank' title='నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా నటించగా ... వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తోనే వక్కంతం వంశీ దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో హీరోగా మొదటి ఆప్షన్ అల్లు అర్జున్ కాదట. వంశీ వేరొకరిని హీరోగా అనుకున్నాడట. అసలు విషయం లోకి వెళితే ... వంశీ "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమా కథ మొత్తాన్ని తయారు చేసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించాడట. కథ మొత్తం విన్న ఆయన తన డెసిషన్ ను కొన్ని రోజుల్లో చెబుతాను అని అన్నాడట. ఇక తారక్ కి కథ చెప్పి వస్తూ ఉండగా దారిలో అల్లు అర్జున్ ఆయనకు కలిశాడట. ఎక్కడికి వెళ్లి వస్తున్నారు అని బన్నీ , వంశీని అడగ్గా, తారక్ కి ఓ కథ చెప్పాను సర్ట్ అన్నాడట. నాకు కూడా సరదాగా ఆ కథ చెబుతారా అని బన్నీ , వంశీని అడగ్గా , ఆయన కథ మొత్తం చెప్పాడట. కథ విన్న ఆయన బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నారు అని చెప్పాడట. ఇక ఆ తర్వాత తారక్ ఆ స్టోరీని రిజెక్ట్ చేశాడట. ఒకానొక రోజు బన్నీ , తారక్ కి ఫోన్ చేసి సూపర్ కథ పెట్టావు తారక్ , బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నావు అని తారక్ తో తో అన్నాడట. కానీ తారక్ సైలెంట్ గా ఉన్నాడట. ఆ తర్వాత వంశీ ద్వారా ఆ కథను తారక్ రిజక్ట్ చేశాడు అని బన్నీకి తెలిసిందట. దానితో బన్నీ , వంశీతో నీకు ఒకే అయితే ఆ కథతో నేను సినిమా చేస్తాను అన్నాడట. దానికి వంశీ కూడా ఓకే అనడంతో surya NAA ILLU INDIA' target='_blank' title='నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే టైటిల్ తో బన్నీ తో వంశీ సినిమాను రూపొందించాడట. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఓ చిన్న నిర్ణయం ద్వారా బన్నీకి భారీ ఫ్లాప్ వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: