
ప్రశాంత్ నీల్ మార్క్ బ్లాక్ అండ్ గ్రే షేడ్స్‌లో ఉన్న ఆ స్టిల్‌లో అంబాసిడర్ కారు, సైకిళ్లు, రోడ్డు మీద రచ్చ రచ్చగా ఉంది. అంటే కథ మామూలుగా ఉండదని హింట్ ఇచ్చేశారు. కానీ ఈ సినిమా స్టోరీ లైన్ 1960ల నాటి బెంగాల్‌లో జరుగుతుందట. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నీల్ ఏం మాయ చేస్తున్నాడో చూడాలిక.
సినిమా మొత్తం 1960ల కాలంలోనే నడుస్తుందంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నీల్, తారక్ ఈ జనరేషన్‌లోకి అస్సలు రారట. అంటే పక్కా పీరియడ్ డ్రామా అన్నమాట. 1960లలో బెంగాల్‌లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను నీల్ రెడీ చేశారని టాక్.
ఒకటే టైమ్ పీరియడ్‌లో సినిమా తీయడం మామూలే కానీ, 1960ల బ్యాక్‌డ్రాప్‌లో అది కూడా బెంగాల్ నేపధ్యంలో సినిమా అంటే మాత్రం మామూలు విషయం కాదు. ప్రశాంత్ నీల్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడనిపిస్తోంది.
ఇక ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. 1960ల కాలం నాటి గెటప్‌లో ఎన్టీఆర్ ని చూడటం ఫ్యాన్స్‌కి చాలా సంతోషాన్నిస్తుంది. సెట్స్ కూడా ఆ కాలం నాటి కలకత్తాని తలపించేలా వేస్తున్నారట. ఇదివరకే నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా వింటేజ్ కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా ఏంటి?
మొత్తానికి కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన తెలుగు సినిమాలు దాదాపుగా హిట్టే అనే సెంటిమెంట్ కూడా ఉంది. మరి చూడాలి.. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో ఈ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తారో లేదో. ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.