స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా చేసే ప్రతి పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. తన ట్రిప్ కు సంబంధించి సమంత ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఫోన్ కు దూరంగా ఉండి ఒంటరి జీవితాన్ని గడిపానని చెప్పిన సమంత తన అనుభూతుల గురించి ఒకింత ఆసక్తికర విషయాలను పంచుకోవడం జరిగింది.
 
తాను మూడు రోజుల పాటు మౌనంగా ఉన్నానని ఫోన్ లేదని ఎవరితో కమ్యూనికేషన్ కూడా లేదని ఆమె అన్నారు. నాతో నేను మాత్రమే ఉన్నానని మనతో మనం ఒంటరిగా ఉండటం చాలా కష్టమైన పనులలో ఒకటి అని సమంత చెప్పుకొచ్చారు. నేను మౌనంగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతానని ఆమె కామెంట్లు చేశారు. నేను మిలియన్ సార్లు ఒంటరిగా గడపమని చెప్పి ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.
 
సమంత గతేడాది సిటాడెల్ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేశారు. సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుండగా అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. సమంత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సమంత బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.
 
సరైన ప్రాజెక్ట్ లతో ముందుకొస్తే సమంత ఖాతాలో మరిన్ని విజయాలు చేరడం పక్కా అని చెప్పవచ్చు. టైర్1 హీరోలు సమంతకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. పుష్ప ది రైజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం సమంతకు మైనస్ అయింది. సమంత కెరీర్ పరంగా తప్పటడుగులు వేస్తున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. సమంత ఇన్ స్టాగ్రామ్ పోస్టుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: