చిరంజీవికి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలతో సఖ్యత లేదు అనే మాట వాస్తవం అని కొన్ని సందర్భాలలో బయటపడుతూ ఉంటుంది.అలా కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి చిరంజీవికి మధ్య గొడవలు ఉన్నాయని,అలాగే నటుడు రాజశేఖర్ తో కూడా చిరంజీవికి సఖ్యత లేదు అనే వార్తలు మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.. ఇక ఈ వార్తలు నిజమేనని అనిపించేలా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ హీరోతో లైవ్ లోనే చిరంజీవి గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఆ వీడియోలో చిరంజీవితో గొడవ పడుతున్న హీరో ఎవరయ్యా అంటే రాజశేఖర్.. యాంగ్రీ మ్యాన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కి చిరంజీవికి మధ్య గొడవలు ఉన్నాయని చాలా రోజుల నుండి వినిపిస్తున్న మాట. 

రాజశేఖర్ భార్య జీవిత చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ఉద్దేశించి సంచలన కామెంట్లు చేసింది.చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఉన్న బ్లడ్ ని డబ్బుల కోసం బయట అమ్ముకుంటున్నారు అంటూ నీచమైన కామెంట్లు చేసింది.అయితే ఆ వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. ఈ విషయం పక్కన పెడితే.. గతంలో ఓ ఈవెంట్ జరగగా.. ఆ ఈవెంట్లో కొంతమంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ లో సడన్గా రాజశేఖర్ లేచి వెళ్ళిపోతుండగా చిరంజీవి వెంటనే పైకి లేచి ఇలా ఇష్టం లేకుండా ఈవెంట్లకు రాకూడదు అని మాట్లాడుతారు.

దాంతో కోపం వచ్చిన రాజశేఖర్ వెనుదిరిగి ఇష్టం లేకుండా నేను ఇక్కడికి రాలేదు  ఇష్టంతోనే వచ్చాను.కానీ ఈ అబద్ధాల మధ్య ఇలాంటి పరిస్థితుల మధ్య నాకు ఉండడం ఇష్టం లేదు అంటూ మైక్ తీసుకుని మాట్లాడారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన చిరంజీవి ఏదైనా విషయం ఉంటే దాని గురించి పూర్తిగా నిజం తెలుసుకొని మాట్లాడాలి.ఏదైనా సంఘం ఉంటే ఇతడి పై వెంటనే చర్యలు తీసుకోవాలని,కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి రాజశేఖర్ మధ్య జరిగిన గొడవకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ ఈ వీడియో చూసి రాజశేఖర్ చిరంజీవి మధ్య విభేదాలు నిజమేనని,స్టేజ్ పైనే తిట్ల దండకం మొదలు పెట్టుకున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: