
జై హనుమాన్ సినిమా అయిపోయిన వెంటనే మోక్షజ్ఞ సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో బాలకృష్ణ కూడా ఇందుకు ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గ్యాప్ లోనే అటు మోక్షజ్ఞ నటనతో పాటుగా డాన్స్ కోసం ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాదిలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడం కష్టమే అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమాలు దాకా వెళ్లి ఒకసారిగా ఆగిపోవడంతో అటు బాలయ్య అభిమానులు నిరాశ చెందారు. దీంతో అప్పటినుంచి మోక్షజ్ఞ సినిమా పైన పలు రకాల రూమర్స్ కూడా వినిపించాయి.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ని బాలయ్య తప్పించారనే విధంగా వదంతులు కూడా ఎక్కువగా వినిపించాయి. మోక్షాజ్ఞను వేరే డైరెక్టర్ పరిచయం చేయబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్న సమయంలో ఇటీవలే చిత్ర బృందం కూడా కొంతమేరకు క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా పలు రకాల వార్తలు వినిపిస్తున్న సమయంలో బాలయ్యతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడి జై హనుమాన్ సినిమా పూర్తి అయిన తర్వాత మోక్షజ్ఞతో సినిమా చేయడానికి అంగీకారం కూడా పొందారట. దీంతో ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా రద్దు కాలేదని విషయం క్లారిటీగా తెలియజేసినట్లు స్పష్టమవుతున్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.