- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమా లు సహా రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ చేతిలో ప్ర‌స్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు , ఓజీ సినిమాల తో పాటు త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్లే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా కూడా ఉంది. ఇక రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న ప‌వ‌న్ ఏపీ ఉప ముఖ్య‌మంత్రి గాను.. అటు కీల‌క శాఖ‌ల‌కు మంత్రిగాను కొన‌సాగుతున్నాడు. ఇక ప‌వ‌న్ ఇటీవ‌ల కాలం లో తన కొడుకు అకిరా నంద‌న్ తో కలిసి ఎక్కువ కనిపిస్తూ ఉండడం ప‌వ‌న్ ఫ్యాన్స్ లో మంచి ఉత్సాహం నింపుతోంది.


ఇక అకీరా నంద‌న్ టాలీవుడ్ ఎంట్రీ మ‌రో రెండేళ్ల త‌ర్వాత ఉంటుంద‌న్న టాక్ ఆల్రెడీ ఉంది. ఇక అకీరా  డెబ్యూ మూవీ కోసం దర్శకుడు ఎవరు అనే ది కూడా ప్ర‌స్తుతానికి బిగ్ స‌స్పెన్సే. అకీరా మొద‌టి మూవీ అంటే ఖ‌చ్చితంగా భారీ అంచ‌నాలు ఉంటాయి. ఓ రేంజ్ లో క్రేజ్‌ ఉంటుంది. ఫ్యాన్స్ అంచ‌నాల కు సినిమా మించే ఉండాలే కాని.. ఏ మాత్రం త‌గ్గినా వారు డిజ‌ప్పాయింట్ అవుతారు.


ఇదిలా ఉంటే అకీరీ డెబ్యూ మూవీ డైరెక్ట‌ర్ పై ఇపుడు కొత్త రూమర్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు ప‌వ‌ర్ స్టార్‌ పవన్ ఫ్రెండ్, తన ఇండస్ట్రీ హిట్ అత్తారింటికి దారేది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే ఉంటుంద‌ట‌. త్రివిక్ర‌మ్ తో ప‌వ‌న్ ముందు జ‌ల్సా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా చేశాడు. ఆ త‌ర్వాత అత్తారింటికి దారేది సినిమా వ‌చ్చింది.. మూడోసారి మాత్రం అజ్ఞాత‌వాసి లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఏదేమైనా అకీరా తొలి సినిమా కు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు అయితే అంచ‌నాలు మామూలుగా ఉండ‌వ‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: