చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీ మీద గంపెడు ఆశలు పెట్టుకొని వస్తూ ఉంటారు. కానీ అలా ఇండస్ట్రీకి వచ్చాక కొన్ని ఇబ్బందులు పడి వాటిని ఎదుర్కొని కొంతమంది రాణిస్తే మరి కొంత మంది ఆ ఇబ్బందులు పడలేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. అలా మన ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ కి ఏదో ఒక విషయంలో క్యాస్టింగ్ కౌచ్ ఎదురైంది అని చాలా సందర్భాలలో చెప్పుకున్నారు. అయితే అవకాశాల కోసం వేరే వాళ్ళ పక్కలోకి వెళ్లడం గురించి తాజాగా సంచలన కామెంట్లు చేసింది మీనాక్షి చౌదరి.. వరుస సినిమాలతో జోరు మీదున్న మీనాక్షి చౌదరి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీ మీద ఆశలు పెట్టుకొని వస్తూ ఉంటారు. కానీ అలా వచ్చిన సమయంలో కొంతమందికి లొంగిపోతూ ఉంటారు. కానీ అలా లొంగిపోకుండా మీ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకోండి.

మనం అవకాశాల కోసం అస్సలు దిగజారి పోకూడదు. ఇక మునపటితో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది.అలాంటి పరిస్థితులు ఎక్కువగా లేవు. అలాగే గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలంటే కూడా కొన్ని పరిమితులు ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఎలాంటి పరిమితులు లేవు. అలాగే సౌత్ లో ఉండే అమ్మాయిలు లావుగా ఉంటారు అనే అపోహ కొంతమందిలో ఉంది. ఆ అపోహను తీసేసి సౌత్ లో ఉండే అమ్మాయిలు కూడా బాగుంటారు అనే అభిప్రాయాన్ని తీసుకురావాలి. ఇక మనం దేన్నయితే నమ్ముకొని ఇండస్ట్రీకి వస్తామో దాని మీదే బలంగా నిలబడాలి. కానీ అవకాశాల కోసం మాత్రం అమ్మాయిలు ఎక్కడ లొంగిపోకూడదు.

మన వ్యక్తిత్వాన్ని కించపర్చుకోకుండా ఇండస్ట్రీలో ముందుకు సాగితేనే మనం సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో కొనసాగుగాలుగుతాం.అందుకే మనం ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాక మన మీద ఎలాంటి మచ్చ ఉండకూడదు అంటే ముందు నుండే మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ రావాలి.మీ ఒరిజినాలిటీని ఎక్కడ మిస్ చేసుకోకండి.టాలెంట్ తో ముందుకు వెళ్ళండి. ఇండస్ట్రీకి వచ్చే కొత్త అమ్మాయిలపై రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అందుకే ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అలా అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతారు అంటూ మీనాక్షి చౌదరి ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఒక మంచి సజెషన్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: