సినిమా ఇండస్ట్రీలో విజయాలు ఉన్న వారికి అదిరిపోయే క్రేజ్ ఉండడం , ప్లాప్స్ వచనం వారికి సినిమా అవకాశాలు తగ్గడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ కొన్ని మంచి సినిమాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులకు ఒకటి , రెండు ఫ్లాప్ తో పెద్దగా ప్రాబ్లం రాదు. కొన్ని సందర్భాలలో మాత్రమే వారు తెరకేక్కించిన సినిమా భారీ ఎత్తున డిజాస్టర్ అయినట్లయితే వారికి కెరియర్లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

అలా ఒకే ఒక డిజాస్టర్ మూవీ తో ప్రస్తుతం చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్న దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన షాక్ అనే మూవీ తో దర్శకుదిగై కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. కానీ ఈ సినిమా తర్వాత ఈయన మిరపకాయ్ అనే మూవీ కి దర్శకత్వం వహించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన గబ్బర్ సింగ్ అనే సినిమాకు దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తో ఈయన స్థాయి చాలా వరకు పెరిగింది. ఇకపోతే ఈ దర్శకుడు కొంత కాలం క్రితం రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. దానితో ఈయన కెరియర్ గ్రాఫ్ చాలా వరకు పడిపోయింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని మళ్ళీ తిరిగి కం బ్యాక్ ఇవ్వాలి అని హరీష్ శంకర్ కసితో ఉన్నట్లు తెలుస్తోంది. మరి మిస్టర్ బచ్చన్ మూవీ తో డిజాస్టర్ ను అందుకున్న హరీష్ శంకర్ , ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: