చావా .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన సినిమా . బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి పడేస్తుంది . రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 100 కోట్లు క్రాస్ చేసేసి చరిత్ర సృష్టించిన చావా సినిమా ఇప్పుడు 1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది.  అవలీల గా 1000 కోట్లు దాటేస్తుంది అంటున్నారు బాలీవుడ్ జనాలు . ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు సరిగ్గా సినిమాలు తీయడం నేర్చుకోలేదు అంటూ పక్క భాష ఇండస్ట్రీలో ఉంటే జనాలు బాగా ట్రోల్ చేశారు .


మరీ ముఖ్యంగా ఎక్కువగా తెలుగు - మలయాళం సినిమాలు హిట్ అవుతున్నాయి అని .. బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అని .. తెలుగు మలయాళం సినిమాలని డబ్  చేసుకుంటూ బాలీవుడ్ బ్రతికేస్తుంది అని నానా విధాలుగా ట్రోల్ చేశారు . అయితే అందరి  నోరులు మూసుకునేలా తెరకెక్కించారు చావా సినిమా.  కాగా ఈ సినిమా అన్ని విధాల పాజిటివ్ టాక్  దక్కించుకున్న ఒకే ఒక కోణంలో మాత్రం నెగిటివ్ టాక్ దక్కించుకుంటుంది.

 

అదే హీరోయిన్ యేసుబాయ్ క్యారెక్టర్ లో  రష్మిక మందన్నా అంతగా సూట్ అవ్వలేదు అంటున్నారు జనాలు. అంతేకాదు ఆమె మాట్లాడే భాష లిప్ సింక్ ఈ సినిమాకి మైనస్ గా మారింది అని విక్కి కౌశల్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడి నటించాడో.. రష్మిక మందన్నా అంతే కష్టపడిందని . కానీ ఆమెకు భాష రాకపోవడం లిప్ సింక్ కుదరకపోవడం థియేటర్లో జనాలను బాగా డిసప్పాయింట్ చేసింది అని చావా సినిమా గురించి ఏదైనా  నెగిటివ్ గా మాట్లాడుకోవాలి అంటే కేవలం రష్మిక మందన్నా గురించి మాత్రమే అంటూ ఆమె గురించి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . ఆల్రెడీ దీనిపై మూఈ టీం కూడా స్పందించింది.  రష్మిక ని ఎందుకు ఈ క్యారెక్టర్ కి చూస్ చూసుకున్నాం అన్నది కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.  ఆమె కళ్ళల్లోనే ఎక్స్ప్రెషన్స్ ఆమె కళ్ళల్లో కనిపించే నిర్మలమైన ఓ ఫీలింగ్ కోసమే ఈ క్యారెక్టర్ ని ఆమెకి ఇచ్చాము అంటూ చెప్పుకొచ్చారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: