- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ వెండి తెరపై తన మార్క్ కామెడీని నాన్ స్టాప్ గా పరిగెత్తించిన నటుడు బాబూ మోహన్. తాజాగా మోహ‌న్ బాబు ఓ ఇంట‌ర్వ్యూ లో చాలా విష‌యాలు ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో నే అప్ప‌ట్లో తాను చేసిన ఎన్నో సినిమా ల‌తో పాటు ఎన్నో పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఆ సినిమా లు వ‌రుస‌లో బావ‌లు స‌య్యా పాట కూడా క‌నిపిస్తుంద‌ని బాబు మోహ‌న్ చెప్పారు. ఇక ఆ ఒక్క పాట కోస‌మే ఆ రోజు ల్లో ప్రేక్ష‌కులు ప‌దే ప‌దే ఆ సినిమాను చూశారు. ఆ సినిమాలో సిల్క్ స్మిత అద్భుతంగా చేసింది" అని బాబు మోహ‌న్ ప్ర‌శంసించారు.


ఇక సెట్స్ లో సిల్క్ స్మిత బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకుని .. కాలుపై కాలు వేసుకుని కూర్చునేది. ఎవరినీ కేర్ చేసేది కాదు. హీరోలు వచ్చినా అలాగే కూర్చుంటావా ? అని అడిగితే .. హీరోలు వ‌స్తే ఎందుకు కాలు తీయాలి .. అని చాలా డేరింగ్ ఆన్స‌ర్ ఇచ్చింద‌ని బాబు మోహ‌న్ గుర్తు చేసుకున్నారు. ఇక ఓ రోజు తాను సిల్క్ ను బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకోవడానికి కారణం ఏంట‌ని అడిగాను .. తనని ఎవరు చూస్తున్నది గమనించడం కోసమే అవి పెట్టుకుంటాను అని చెప్పింద‌ని .. ఇక త‌న‌ను ఎప్పుడూ కూడా బాస్ అని పిలుస్తూ, నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేద‌ని చెప్పారు.


ఇక ఓ సారి దుబాయ్ షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు షాపింగ్ కోసం నన్ను రమ్మంటే వెళ్లాన‌ని ... అక్కడ ఆమె స్పెట్స్ తీసి చూపించి ఎలా ఉంద‌ని అడ‌గ‌డం తో తాను సూప‌ర్ గా ఉంద‌ని చెప్పాన‌ని .. వెంట‌నే సిల్క్ స్మిత అయితే ఇది నీ కోస‌మే అంటూ నాకు పెట్టింద‌ని బాబు మోహ‌న్ తెలిపారు. సిల్క్ స్మిత‌ ఏ ఎండకి ఆ గొడుకు పట్టేరకం కాదు. అలాంటివారిపై వివాదాలు రావడం సహజమే అని నాటి సంగ‌తులు గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: