నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి అందులో అనేక మూవీలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే వీరి కాంబోలో దసరా అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ది పారడైజ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీ లో నానికి జోడిగా నటించబోయే హీరోయిన్ కి సంబంధించి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో నాని కి జోడిగా రష్మిక మందన ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని , అందుకు సంబంధించిన సంప్రదింపులు ప్రస్తుతం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అన్ని ఓకే అయితే ఈ సినిమాలో నాని కి జోడిగా రష్మిక మందన కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో నాని , నాగార్జునతో కలిసి దేవ్ దాస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నాని కి జోడిగా రష్మిక మందన నటించగా ... ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కూడా ఈ మూవీ లో నాని , రష్మిక జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకులు నుండి మాత్రం మంచి ప్రశంసలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: