టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన కొత్త లోనే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు. దానితో చాలా తక్కువ కాలం లోనే పూరి జగన్నాథ్ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. ఇకపోతే చాలా కాలం పాటు అద్భుతమైన విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగించిన ఈ దర్శకుడు ఈ మధ్య కాలంలో మాత్రం ప్రేక్షకులను తన సినిమాలతో ఆకట్టుకోవడంలో చాలా వరకు విఫలం అవుతూ వస్తున్నాడు.

ఇకపోతే పూరీ జగన్నాథ్ ఆఖరుగా రామ్ పోతినేని హీరో గా రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయాన్ని అనుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ ని రూపొందించాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ , గోపీచంద్ హీరో గా గోలీమార్ అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ మూవీ ని గోపీచంద్ తో తీయబోతున్నట్లు , అది గోలీమార్ మూవీ కి కొనసాగింపుగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందించిన డబల్ ఈస్మార్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో గోపీచంద్ తో పూరి జగన్నాథ్ ఒక వేళ మూవీ ని రూపొందిస్తే అది గోలీమార్ సినిమాకి సీక్వెల్ అయినట్లయితే ఈసారైనా సీక్వెల్ మూవీతో పూరి జగన్నాథ్ మంచి విజయాన్ని అందుకుంటాడా లేదా అనే అనుమానాలు ప్రజల్లో రైకెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: