సౌత్, నార్త్ అనే తేడాల్లేకుండా తన గాత్రంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సింగర్లలో శ్రేయా ఘోషల్ ఒకరు. శ్రేయా ఘోషల్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉండగా ఆమె పారితోషికం ఎక్కువగా ఉన్నా ఆఫర్లు అయితే తగ్గడం లేదు. తండేల్ సినిమాలో హైలెస్సో హైలెస్సా పాటను ఆమె అద్భుతంగా పాడగా ఆ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.
 
దేశంలోని ప్రధాన నగరాలలో శ్రేయా ఘోషల్ మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ ను నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మ్యూజిక్ అంటే నాకు ఎంతో ఇష్టమని భాషలకు అతీతమైన అభిమానం నా పాటలకు లభించడం లక్ గా భావిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఇతర భాషలతో పోల్చి చూస్తే తమిళ, మలయాళ భాషల్లో పాటలు పాడటం కొంతమేర కష్టంగా ఉంటుందని శ్రేయా ఘోషల్ చెప్పుకొచ్చారు.
 
ఆ భాషల్లో పాటలు పాడటానికి కొంతమేర ఎక్కువ సమయం తీసుకుంటానని శ్రేయా ఘోషల్ పేర్కొన్నారు. ప్రెస్ మీట్ తర్వాత శ్రేయా ఘోషల్ మున్బే వా ఎన్ అన్బే వా అనే తమిళ గీతాన్ని అద్భుతంగా ఆలపించారు. శ్రేయా ఘోషల్ వాయిస్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. శ్రేయా ఘోషల్ తెలుగులో మరిన్ని సాంగ్స్ పాడి విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
శ్రేయా ఘోషల్ రెమ్యునరేషన్ ఎంత ఎక్కువగా ఉన్నా కొన్ని సాంగ్స్ కు ఆమె వాయిస్ మాత్రమే పర్ఫెక్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రేయా ఘోషల్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి ఎన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తునారు. శ్రేయా ఘోషల్ వయస్సు పెరుగుతున్నా ఆమె క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ సైతం అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. శ్రేయా ఘోషల్ కెరీర్ విషయంలో ఒకింత ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. శ్రేయా ఘోషల్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: