స్టార్ హీరోల కుమారులు ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తారా అని ఆ హీరో అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎవరి ఎంట్రీ కోసం అయితే ఎక్కువ మంది జనాలు ఎదురు చూస్తూ ఉంటారో వారికి సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వారిలో నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ ఉన్నారు.

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించి చాలా కాలం నుండి అనేక వార్తలు వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. మోక్షజ్ఞ ఆ దర్శకుడి సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు ..? ఈ దర్శకుడి సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అని వార్తలు వచ్చాయి. ఇక ఎట్టకేలకు మోక్షజ్ఞ , ప్రశాంత్ వర్మ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఆ తర్వాత ఈ కాంబో మూవీ క్యాన్సిల్ అయింది అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మోక్షజ్ఞ ఏ దర్శకుడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అనే దానిపై ప్రస్తుతం కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అయినటువంటి అకీరా నందన్ ఎంట్రీ కి సంబంధించి కూడా అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే అకీరా నందన్ , పవన్ కళ్యాణ్ కి స్నేహితుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే బోయే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు మరికొన్ని రోజుల్లోనే అఖీరా నందన్ ఎంట్రీ కి సంబంధించిన కథ పనులు ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇలా మోక్షజ్ఞ , అఖీరా నందన్ ఎంట్రీలకు సంబంధించి అనేక వార్తలు వైరల్ అవుతూనే వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: