
ప్రస్తుతమైతే ధడక్ 2 సినిమాల నటిస్తూ ఉన్నది. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే గత కొద్దిరోజుల నుంచి ఒక ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు పలు రకాల ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లలో షేర్ చేస్తూ ఉండడంతో ఈ విషయాలకు మరింత బలాన్ని చేకూర్చేలా అయ్యింది.
త్రిప్తి దిమ్రి తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బైక్ పైన చెడ్డ పట్టాలేసుకొని మరి తిరుగుతూ ఉన్నట్లుగా ఒక వీడియో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ముఖ్యంగా నడిరోడ్డు పైన తన ప్రియుడిని పట్టుకొని మరి వితౌట్ మేకప్ తో మాస్క్ ధరించి ఇలా ముఖం కనిపించకుండా త్రిప్తి దిమ్రి కవర్ చేసుకోవడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.. ఈ విషయం చూసిన పలువురు నెటిజెన్స్ వివాహం చేసుకోకుండానే ఇలా తిరిగేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.త్రిప్తి దిమ్రి బాయ్ ఫ్రెండ్ విషయానికి వస్తే గోవాలో పలు రకాల లగ్జరీ క్లబ్బులతో పాటు హోటల్స్ కూడా ఉన్నట్లు సమాచారం మొత్తానికి ఈ బోల్డ్ బ్యూటీ ఇలా వివాహం కాకుండానే బాయ్ ఫ్రెండ్ తో చట్టా పట్టాలేసుకొని తిరుగుతోంది.