తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . బాలయ్య ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి ప్రస్తుతం కూడా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోల లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే మూవీలో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

మూవీ తర్వాత బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి , బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమాలలో హీరోగా నటించిన వరుసగా నాలుగు విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య "అఖండ" మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత కూడా ఏకంగా నలుగురు దర్శకులను బాలయ్య లైన్ లో పెట్టి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం బాలయ్య "అఖండ 2" సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్యమూవీ చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది.

అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ , బాబి కొల్లి దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు దర్శకులతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయడానికి బాలయ్య రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా అఖండ 2 మూవీ తర్వాత ఏకంగా నలుగురి దర్శకులను బాలయ్య లైన్ లో పెట్టి రెడీగా ఉన్నట్లు వరుస పెట్టి వారితో సినిమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: