సాధారణంగా స్టార్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు సాధారణ ప్రజలు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .. ఒక హీరో ఆస్తి ఎంతా ? వారి జీతం ఎంత ? వారి దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి ? ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అభిమానులకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ? అంతే కాకుండా పెద్దపెద్ద లగ్జరీ భవనాల్లో నివసించే బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లకు విద్యుత్ బిల్లు ఎంత ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి కూడా చాలామందికి ఉంటుంది . అయితే ఇప్పుడు అలాంటి వారి కోసమే ఈ వార్త .. బాలీవుడ్ లోని చాలామంది అగ్ర‌ సెలబ్రిటీలకు ముంబైలో సొంత భవనాలు ఉన్నాయి.. షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్ .. అమితాబచ్చన్ విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటున్నారు .. ఇతర హీరోల నివాసాలు కూడా ముంబైలోనే ఉన్నాయి .. ఈ అగ్ర సెలబ్రిటీలు తమ ఇంటిని అందంగా కనిపించాలని కోరుకుంటారు .. అందుకోసం తమ ఇళ్లకు రంగురంగు లైట్లు దీపాలతో అందంగా అలంకరిస్తారు .. మరి అలాంటి అగ్ర సెలబ్రిటీల ఇళ్లకు కరెంట్ బిల్లు ఎంత ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం.


షారుక్ ఖాన్ కు మొబైల్ లో మన్నత్ అనే పేరు మీద భారీ ఇల్లు ఉంది .. ఇది రాజ భవనం లాగా ఉంటుంది .. ఈ ఇంట్లో ఎన్నో గదులు ఉన్నాయి.. అలాగే ఈ ఇంటి కోసం షారుక్‌ ప్రతినెలా 43 నుంచి 45 లక్షల వరకు కరెంట్ బిల్ చెల్లిస్తారట. సల్మాన్ ఖాన్ కి కూడా బాలీవుడ్ లో మరో స్టార్ హీరోహీరో కూడా ముంబైలో ఎన్నో ఆస్తులు ఉన్నాయి .. ప్రస్తుతం ఈ బాలీవుడ్ కండలు వీరుడు గాలక్సీ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు .. ఈ హీరో కూడా ప్రతి నెల 23 నుంచి 25 లక్షల వరకు కరెంటు బిల్లు కడతాడట. బాలీవుడ్ బిగ్బి అమితాబచ్చన్ ఎన్నో సంవత్సరాల నుంచి బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు .. ఈ సీనియర్ హీరోకి కూడా జుహులో సొంత బంగ్లా ఉంది .. ఈ బంగ్లా కోసం అమితాబ్ ప్రతినెల 22 -25 లక్షల వరకు కరెంట్ బిల్లు చెల్లిస్తారట.


రణవీర్ సింగ్, దీపికా పదుకొనే పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాలయింది . వీరిద్దరూ ఎంతో ఆనందమైన జీవితాన్ని నివసిస్తున్నారు. ఇక ఈ జంట కూడా ముంబైలోని 4BHK అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు .. ఈ జంట కూడా 13-14 లక్షల వరకు కరెంట్ బిల్లు చెల్లిస్తున్నారట. మరో బాలీవుడ్ స్టార్ జంట‌ సైఫ్ అలీ ఖాన్ , కరీనాకపూర్ కూడా ముంబైలోని సద్గురు శరన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు .. ఈ జంట కూడా ప్రతి నెల 30-32 లక్షల వరకు కరెంట్ బిల్లు చెల్లిస్తారట ..  ఇక మరో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్  కూడా ముంబైలో భారీ అపాయింట్మెంట్ ఉంది .. ఈయన కూడా ప్రతి నెల 9 నుంచి 11 లక్షల వరకు కరెంట్ బిల్లు చెల్లిస్తారట. మరో బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ పెళ్లి చేసుకుని ముంబైలోనే కాపురం చేస్తున్నారు .. ఇక వీరు కూడా 4BHK అపార్ట్మెంట్లో ఉంటున్నారు .. ఈ జంట కూడా ప్రతి నెల 10 లక్షల వరకు కరెంట్ బిల్లు చెల్లిస్తారని అంటున్నారు. ఇలా బాలీవుడ్ లో ఉన్న అగ్ర సెలబ్రిటీలు ప్రతినెల చెల్లించే కరెంటు బిల్లుకు సామాన్యుడు ఒక సొంత ఇంటిని నిర్మించుకొనే అంతగా వారి కరెంట్ బిల్లు ఉంటున్నాయి. ఇదే వార్త ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: