- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన టాలీవుడ్ యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో నార్త్ మార్కెట్ పై తన బ్రాండ్ వేద్దామనుకుంటే పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయట. దేవరతో నార్త్ బెల్ట్‌లో ఎన్టీఆర్ తనకంటూ మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే పాన్ ఇండియా సినిమాలతో కాకుండా.. బాలీవుడ్ బాక్సాఫీస్ పై నేరుగా తన హవా చూపించేందుకు ప్రిపేర్ అయ్యాడు.


అందుకే డైరెక్ట్‌గా బీటౌన్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్ సినిమాలో ఢీకొట్టబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సరవేగంగా జరుగుతోంది. వార్ 2 సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో యష్‌ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 14న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ఏడాది క్రితమే ఎనౌన్ చేశారు. అయితే బాలీవుడ్ వర్గాలలో ఈ సినిమా గురించి కొత్త రూమర్ వినబడుతుంది. వార్‌ 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదట.


మరో భారీ షెడ్యూల్ పూర్తి కావాల్సి ఉందని.. దీనికి కొంత టైం పడుతుందని.. అందుకే అనుకున్న డేట్ కు ఈ సినిమా రాకపోవచ్చు అని.. అంటున్నారు. నార్త్ బెల్ట్‌లో ఎన్టీఆర్ ఎంట్రీని భారీగా సెలబ్రేట్ చేసుకుందామని వెయిట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఈ న్యూస్ బాగా ఇరిటేట్ చేస్తుంది. అటు ప్రశాంత్ నీల్‌ సినిమాను పట్టాలికించేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతుంటే.. వార్ 2 షూటింగ్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి తప్పదని తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్‌కు కాస్త టెన్షన్‌గా మారినట్టు సమాచారం. వార్ 2 . . ప్ర‌శాంత్ నీల్ సినిమా ల త‌ర్వాత దేవ‌ర 2 ప‌ట్టాలు ఎక్క‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: