కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు అయినటువంటి విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో వెంకటేష్ కి జోడిగా అంజలి నటించగా ... మహేష్ కి జోడిగా సమంత నటించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , జయసుధ , రావు రమేష్ కీలకమైన పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర కోసం మొదట ఏకంగా ఓ కోలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారట. అందులో భాగంగా ఆయనను సంప్రదించారట. కానీ ఆయన ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ ప్రకాష్ రాజుకు వచ్చిందట. మరి మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ కోసం ప్రకాష్ రాజ్ పాత్రకు అనుకున్నది ఎవరిని ..? ఆయన ఎందుకు ఆ పాత్రను రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయిన తర్వాత అందులో ప్రకాష్ రాజు పోషించిన రేలంగి మావయ్య పాత్ర కోసం అనేక మంది నటులను అనుకున్నారట. అందులో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రజినీ కాంత్ అయితే ఆ పాత్రకు అద్భుతంగా సెట్ అవుతాడు అనే ఉద్దేశంతో ఆయనను వెళ్లి కలిసి కథను కూడా ఈ మూవీ మేకర్స్ వివరించారట. కానీ రజనీ కాంత్ మాత్రం కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను చేయలేను అని చెప్పాడట. దానితో ప్రకాష్ రాజ్ ఆ పాత్రకు సెట్ అవుతాడు అనే ఉద్దేశంతో ఆయనను కలిసి ఆయనకు కథను వివరించగా ఆయన ఆ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ లోని రేలంగి మావయ్య పాత్ర ద్వారా ప్రకాష్ రాజ్ కి అద్భుతమైన గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: