
మరి ఈ వార్తలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా మెగా కుటుంబం తెలియజేయవలసి ఉన్నది. ఇక చిరంజీవి తల్లి అంజనదేవి ఐదుగురు సంతానం అందులో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, మాధవి, విజయలక్ష్మి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్గా నిర్వహించారు. అందుకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. చిరంజీవి ఒకవైపు సినిమాలు మరొకవైపు సినిమా ఇండస్ట్రీ బాధ్యతలను తీసుకోవడమే కాకుండా అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు.
చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే విశ్వంభర అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా హీరోయిన్గా త్రిష నటిస్తోంది. ఇటీవలే కాలంలో చిరంజీవి సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉంటున్నారు. మరి విశ్వంభర సినిమాతో అభిమానులను ఫుల్ ఖుషి చేస్తారో లేదో చూడాలి మరి. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఇక పవన్ కళ్యాణ్ కూడా వరుస సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.