- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మన టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గ‌త కొంత కాలంగా స‌రైన హిట్లు లేకుండా కెరీర్ ప‌రంగా ప‌డుతూ లేస్తున్నాడు. విజ‌య్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం గా చేసిన పాన్ ఇండియా సినిమా లైగ‌ర్ పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. . ఈ సినిమా కు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా తో విజ‌య్ ప‌రువు పోయిన‌ట్ల‌య్యింది. పాన్ ఇండియా హ‌డావిడి తుస్సు మంది. ఆ త‌ర్వాత ఖుషి పెద్ద‌గా ఆడ‌లేదు. ఇక దిల్ రాజు బ్యాన‌ర్లో చేసిన ఫ్యామిలీ స్టార్ కూడా సీరియ‌ల్ టైప్ సినిమా గా విమ‌ర్శ‌లు వేసుకుంది.


ఈ క్ర‌మంలోనే ఇప్పుడు విజ‌య్ హీరోగా ఇపుడు నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ పినిమా కింగ్‌డ‌మ్‌.  యువ‌ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వం లో రూపొందుతోన్న పక్కా మాస్ అండ్ భారీ యాక్ష‌న్‌ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా నుంచి ఇటీవ‌లే వ‌చ్చిన గ్లింప్స్ తో హైప్ నెక్స్ట్ లెవెల్లోకి ఈ సినిమాకి వెళ్ళిపోయింది. అయితే కింగ్‌డ‌మ్ షూటింగ్ శరవేగంగా పూర్తవుతుండగా లేటెస్ట్ అప్డేట్ ఈ సినిమా నుంచి వ‌చ్చేసింది.


టాలీవుడ్ ఇన్న‌ర్ సైడ్ వ‌ర్గాల ప్ర‌కారం కింగ్ డ‌మ్ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్టు తెలుస్తోంది. మేక‌ర్స్ అయితే లేటెస్ట్ గా వైజాల్ షెడ్యూల్ స్టార్ట్ చేశార‌ట‌. ఈ షెడ్యూల్ మార్చ్ మొదటి వారం వరకు ఉంటుంది. దీంతో కింగ్‌డ‌మ్ సినిమా సూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ఈ సినిమాకు త‌మిళ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ త‌న‌ సాలిడ్ వర్క్ అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. మే 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: