టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇకపోతే తారక్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ద్వారా తారక్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ విజయం తర్వాత తారక్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 సినిమాలో హీరో గా నటించాడు.

సినిమా కూడా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. దాంతో తారక్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే కొంత కాలం క్రితం తారక్ , ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ రూపొందబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక నిన్న ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రారంభం అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఫోటోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు కూడా తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తారక్సినిమా కోసం అదిరిపోయే రేంజ్ లో పారితోషకం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ కోసం తారక్ ఏకంగా 120 కోట్ల భారీ పారితోషకాన్ని అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం తారక్ హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇక మరికొన్ని రోజుల్లోనే దేవర పార్ట్ 2 మూవీ షూటింగ్ ను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: