ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన్నా.. గత సంవత్సరం య‌నిమల్ , పుష్పా 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ .. ఇప్పుడు మరోసారి చావా సినిమాతో మరో విజయం అందుకుంది. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ కు జంటగా నటించిన ఈ సినిమాకు రోజురోజుకు మరింత ఆదరణ వస్తుంది .. అయితే ఇప్పుడు ఈమె పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ హీరొయిన్ గా మారిపోయింది .. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడివేస్తుంది ..


హీరోయిన్ గ్లామర్ పాత్రలే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు తెచ్చుకుంటుంది .. ఈ క్రమంలోనే రష్మికకు సంబంధించిన తన పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ..  పైన ఫోటోను గమనించారు కదా ? ఇక అందులో రష్మిక తో క్లోజ్ గా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో కనిపెట్టారా ? ఆమె కూడా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ తెలుగులో రెండు సినిమాల్లో నటించింది కూడా.. తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ కి తెలుగులో అంతగా అవకాశాలు రావట్లేదు .. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ .. కన్నడ చిత్ర పరిశ్రమలో రష్మిక మందన్నా , ఆషికా రంగనాథ్ మంచి స్నేహితులు ..


ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుంది.. కానీ ఆషికాకు మాత్రం అంతగా అవకాశాలు అందటం లేదు .. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమీగోస్‌ సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమైంది .. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది .. దాంతో తెలుగులో ఆషికాకు సరిగ్గా ఆఫర్స్ రాలేదు .. ఆ తర్వాత కొద్ది రోజులకే నాగర్జున నటించిన నా స్వామి రంగా సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా నటించి మెప్పించింది .. ఈ సినిమాలో వరలక్ష్మీ పాత్రతో తన అద్భుతమైన నటనతో గొప్పనటిగా ప్రశంసలు అందుకుంది .. కానీ ఆ తర్వాత కూడా టాలీవుడ్ లో ఆఫర్స్ రాలేదు .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక సినిమా కూడా లేదట .. కానీ సోషల్ మీడియాలో మాత్రం వరుస హాట్ హాట్ పోస్టులతో రచ్చ లేపుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: