కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే పవర్ ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రజనీ కాంత్ హీరో గా నటిస్తున్న మూవీ కావడం ... ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజ్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తుండడం ... ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో మరింతగా పెరిగిపోయాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... లోకేష్ కనకరాజు ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను డిజైన్ చేసినట్లు , దానిని మరికొన్ని రోజుల్లోనే షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఐటెం సాంగ్ లో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన బ్యూటీలలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే ను తీసుకోవాలి అని మేకర్స్ ఆలోచనకు వచ్చినట్లు , అందులో భాగంగా ఆమెతో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు , అన్ని ఓకే అయితే కూలీ సినిమా స్పెషల్ సాంగ్లో పూజా హెగ్డే కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే పూజా హెగ్డే రంగస్థలం , ఎఫ్ 3 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. దానితో కూలీ సినిమాలో కూడా ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేస్తే ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం పక్కా అని రజనీ ఫ్యాన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: