పైన ఫోటో చూశారు కదా ? అందులో బుడ్డోడిని గుర్తుపట్టారా ? చిత్ర పరిశ్రమలో అబ్బాయిగా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా కుర్రాళ్ల గుండెలు గెలుచుకుంది .. ఈ బుడ్డోడు గుర్తున్నాడా ? బాలీవుడ్ భాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన కభీ అల్విదా నా కెహనా సినిమాలో నటించి అదరగొట్టింది .. ఇంత‌కి ఆమె మరెవరో కాదు .. అహ్సాస్ చన్నా .. ఒక సినిమాతోనే ప్రేక్షకులో భారీ గుర్తింపు తెచ్చుకుంది .. ఈ సినిమాలో షారుక్ ఖాన్ , ప్రీతిజింతా కు కొడుకుగా కనిపించి మెప్పించింది .. తర్వాత అహ్సాస్ చన్నా 1999న ఆగస్ట్ 5న ముంబైలోని పంజాబీ స్టిక్కు కుటుంబంలో జన్మించింది .. ఆమె తండ్రి ఇక్బాల్ సింగ్ చన్నా ... ఈయన పంజాబీ చిత్ర పరిశ్రమ నిర్మాత  .. తల్లి కుల్బీర్ బడేస్రాన్ నటి. వీర్ జారా, కేసరి, మంటో, సీఐడీ, క్రైమ్ పెట్రోల్ వంటి సినిమాల్లో  నటించింది.. అలాగే ప‌లు   వెబ్ షోలలోనూ పాల్గొంది.


అయితే ఐదు సంవత్సరాల వయసులోనే చిత్ర‌ పరిశ్రమలో అడుగుపెట్టింది .. అలాగే 2004 లో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో కూడా సుష్మితాసేన్ కొడుకుగా కూడా నటించింది .. ఆ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో 2006లో వచ్చిన కభీ అల్విదా నా కెహనాలో అహ్సాస్ మూవీతో మరింత గుర్తింపు తెచ్చుకుంది . 2007లో రిలీజ్ అయ‌న మై ఫ్రెండ్ గణేష్ సినిమాలో కూడా వినాయకుడితో స్నేహం చేసే అబ్బాయిగా కనిపించింది .. ఇక తర్వాత హిందీలో ఎన్నో సినిమాలు నటించి మెప్పించింది.


ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన గ్లామర్ షో తో అరాచకం సృష్టిస్తుంది .. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు తో సోషల్ మీడియాలో కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది .. అలాగే బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా కూడా ఉంటుంది .. ఇన్ స్టాలో ఈమె అనేక బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది ..  ఇప్పటివరకు ఈమె ఆస్తులు పది కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం .. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు వ‌య‌సు 24 ఏళ్లు మాత్రమే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి ..




మరింత సమాచారం తెలుసుకోండి: