
అంతేకాదు సాయి పల్లవి గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుకునే జనాలు ఎక్కువ . రీసెంట్ గా సోషల్ మీడియాలో సాయి పల్లవికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అయింది . అమరన్ సినిమాతో అదేవిధంగా తండేల్ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సాయి పల్లవి ప్రెసెంట్ బాలీవుడ్ లో రామాయణం మూవీ చేస్తుంది. తెలుగులోనే రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో శింబుతో ఒక ప్రాజెక్ట్ ఓకే చేసింది అంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి .
కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త హైలెట్గా మారింది . సాయి పల్లవి రొమాంటిక్ హీరో శింబు తో మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది అన్న సంగతి అందరికీ తెలుసు . అయితే ఇన్నాళ్లు ఇది ఊరికే వైరల్ అయ్యే ఫేక్ వార్త అనుకున్నారు . కానీ కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ అఫీషియల్ గా కన్ఫామ్ అయిపోయింది అని .. ఆ అగ్రిమెంట్ పేపర్లపై సాయి పల్లవి సైన్ చేసేసింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇది పూర్తిగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కబోతున్న సినిమా అని కూడా తెలుస్తుంది. అయితే కొంతమంది సాయి పల్లవి అభిమానులు మాత్రం హీరో శింబుతో ఆమె సినిమా కమిట్ అవ్వడం పట్ల పాజిటివ్గా స్పందిస్తుంటే ..మరి కొంతమంది మాత్రం పోయి పోయి ఆ హీరో ఎందుకు సినిమా ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఆల్రెడీ శింబు ఖాతాలో ఎంతమంది హీరోయిన్లు బలి అయ్యారో అందరికీ తెలిసిందేగా అంటూ మాట్లాడుకుంటున్నారు..!