మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ అనేక సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. ఇకపోతే వీరిద్దరూ సంక్రాంతి పండక్కు అనేక సార్లు బాక్సా ఫీస్ దగ్గర తలపడ్డారు. మరి ఇప్పటివరకు చిరంజీవి , బాలకృష్ణ ఎన్ని సార్లు సంక్రాంతి పండక్కు ఏ సినిమాలతో తలపడ్డారు అనే వివరాలను తెలుసుకుందాం.

1985 వ సంవత్సరం సంక్రాంతి పండక్కు మొదటి సారి చిరంజీవి , బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డారు. చిరంజీవి చట్టంతో పోరాటం సినిమాతో బాలకృష్ణ ఆత్మబలం సినిమాతో ఆ సంవత్సరం సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. ఆ తర్వాత 1987 వ సంవత్సరం చిరంజీవి దొంగ మొగుడు సినిమాతో సంక్రాంతి బరిలో నిలవగా , బాలకృష్ణ భార్గవ రాముడు సినిమాతో సంక్రాంతి భరిలో నిలిచాడు. ఆ తర్వాత 1988 వ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మంచి దొంగ సినిమా విడుదల కాగా , బాలకృష్ణ హీరోగా రూపొందిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా విడుదల అయింది. ఇక ఆ తర్వాత 1997 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా చిరంజీవి హీరోగా రూపొందిన హిట్లర్ మూవీ విడుదల కాగా , బాలకృష్ణ హీరోగా రూపొందిన పెద్దన్నయ్య సినిమా విడుదల అయింది. ఇక 1999 వ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన స్నేహం కోసం సినిమా సంక్రాంతి బరిలో నిలవగా , ఆ సంవత్సరం బాలకృష్ణ "సమర సింహా రెడ్డి" మూవీ తో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఇక 2020 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన అన్నయ్య , బాలకృష్ణ హీరోగా రూపొందిన వంశోద్ధారకుడు సినిమాలు విడుదల అయ్యాయి.

ఇక 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇక 2004 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన అంజి , బాలకృష్ణ హీరోగా రూపొందిన లక్ష్మీ నరసింహ సినిమాలు విడుదల అయ్యాయి. ఇక 2017 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 , బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాలు విడుదల అయ్యాయి. ఇక 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ , బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీలు విడుదల అయ్యాయి. ఇలా సంక్రాంతి పండక్కు చిరు , బాలయ్య అనేక సార్లు పోటీ పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: