సినిమా ఇండస్ట్రీ లో ఎవరికైతే మంచి విజయాలు దక్కుతాయో వారికి వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతాయి అని వారు అద్భుతమైన స్థాయికి చేరుకుంటారు అనే అభిప్రాయాలను చాలా మంది వినిపిస్తూ ఉంటారు. కానీ కొంత మంది విషయంలో మాత్రం ఇది తప్పు అని రుజువు అవుతూ వస్తోంది. కొంత మంది కి వరుసగా విజయాలు లేకపోయినా మంచి సినిమాల్లో అవకాశాలు వస్తూ ఉంటాయి. కెరీర్ను కూడా అద్భుతమైన స్థాయిలో ముందుకు సాగిస్తూ ఉంటారు.

అలా తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో కావ్య దాపర్ ఒకరు. ఈ బ్యూటీ ఏక్ మినీ కథ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు రావడం , ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ బ్యూటీ ఇప్పటి వరకు తెలుగు లో మిడిల్ క్లాస్ ప్రేమ , ఈగల్ , ఊరు పేరు భైరవకోన , డబల్ ఈస్మార్ట్ , విశ్వం అనే సినిమాల్లో నటించింది. ఈ సినిమాలలో కేవలం ఊరు పేరు భైరవకోన మూవీ మాత్రమే మంచి విజయాన్ని అందుకుంది.

మిగతా సినిమాలన్నీ కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా ఈమె ఇప్పటి వరకు తెలుగు లో చాలా సినిమాల్లో నటించిన ఒకే ఒక్క విజయాన్ని అందుకుంది. కానీ ఈమెకు మాత్రం వరుస పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సినిమాల్లో తన నటన కంటే కూడా అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: