నటుడిగా..రచయితగా.. పలు సినిమాలకు వర్క్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉండరు. అయితే అలాంటి పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఛత్రపతి శివాజీ రోల్ లో ఆ హీరో అయితే బాగా సెట్ అవుతారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మరి ఇంతకీ ఛత్రపతి శివాజీ పాత్రలో సెట్ అయ్యే ఆ తెలుగు హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. తాజాగా బాలీవుడ్ లో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఛావా మూవీ గురించే అందరూ మాట్లాడుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.విక్కీ కౌశల్, రష్మిక కలిసి నటించిన ఛావా మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఆయన భార్య యేసు భాయి పాత్రలో రష్మిక నటించారు. 

అయితే  ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా తీసుకురావాలని ఎంతోమంది ఇతర ఇండస్ట్రీల అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.అయితే తాజాగా విడుదలైన ఛావా మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ మన తెలుగు ఇండస్ట్రీలో ఛత్రపతి శివాజీ సినిమా తీసుకురావాలంటే ఆ శివాజీ మహారాజ్ పాత్రలో మహేష్ బాబు మాత్రమే బాగా సెట్ అవుతారు. ఇక ఒకప్పుడు మహేష్ బాబు తండ్రి కృష్ణకి శివాజీ మహారాజ్ పాత్రలో నటించాలని ఎంతో కోరిక ఉండేది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. కానీ ఆయన సింహాసనం సినిమా తర్వాత ఇది చేద్దాం  అనుకున్నారు.

కానీ ఆయన ఆలోచన కార్య రూపం దాల్చలేదు.కానీ నెంబర్ -1, చంద్రహాస్ సినిమాల్లో శివాజీ పాత్రలో కొద్దిసేపు కనిపించారు.అలా ఆయనకు చత్రపతి శివాజీ పాత్రలో నటించాలనే కోరిక ఎంతో ఉండేది.కానీ ఆయన మరణించడంతో ఆ కోరిక తీరలేదు. కానీ తండ్రి కోరిక మహేష్ బాబు నెరవేర్చాలని మనం కోరుకుందాం. మీరు కూడా మహేష్ బాబుని చత్రపతి శివాజీ సినిమాలో నటించమని కోరండి.ఆయన శివాజీ మహారాజ్ పాత్రలో అద్భుతంగా సెట్ అవుతారు అంటూ పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈయన మాటలు మహేష్ బాబు అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: